వ‌ర‌ద బాధితుల‌కు మోదీ స‌ర్కార్‌ ఏం సాయం చేసిందో చెప్పాలి: అసదుద్దీన్‌ ఒవైసీ

వాస్తవం ప్రతినిధి: త్వరలో జరుగనున్న గ్రేటర్ ఎన్నికల్లో 52 స్థానాల్లో పోటీ చేస్తున్నామని ఎంఐఎం అధినేత అసదుద్దీన్‌ ఒవైసీ స్పష్టం చేశారు . జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌తో పొత్తు లేదని తెలిపారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ 52 స్థానాల్లో పోటీ చేస్తున్నామని, చాలా చోట్ల టీఆర్‌ఎస్సే తమకు పోటీ అని తెలిపారు. హైదరాబాద్‌కు భారీ వరద వస్తే కేంద్రం సాయం చేయలేదని ఆయన విమర్శించారు. బీజేపీ హిందూత్వాన్ని ప్రజలపై బలవంతంగా రుద్దేందుకు ప్రయత్నిస్తోందని మండిపడ్డారు.

హైద‌రాబాద్ వ‌ర‌ద బాధితుల‌కు వాళ్లు ఏం సాయం చేశారో చెప్పాల‌ని ఆయ‌న‌ డిమాండ్ చేశారు. హైద‌రాబాద్ ప్ర‌జ‌ల‌కు వాళ్లు ఏ సాయం చేయ‌లేదు కాబ‌ట్టే జీహెచ్ఎంసీ ఎన్నిక‌ల్లో మ‌తం పేరుతో ఓట్లు రాబ‌ట్టే ప్ర‌య‌త్నం చేస్తున్నార‌ని మండిప‌డ్డారు.

అయితే, బీజేపీ ఎత్తులు హైద‌రాబాద్‌లో పార‌వ‌ని, ఇక్క‌డి ప్ర‌జ‌లకు ఎవ‌రేంటో అంతా తెలుస‌ని అస‌దుద్దీన్ పేర్కొన్నారు. బీజేపీ నేత‌ల‌ను నిద్ర‌లో లేపి కొన్ని పేర్లు చెప్ప‌మంటే వాళ్లు చెప్పే పేర్ల‌లో ఓవైసీ అనే పేరు క‌చ్చితంగా ఉంటుంద‌ని ఆయ‌న ఎద్దేవా చేశారు. త‌న పేరుతోపాటు ద్రోహం, ఉగ్ర‌వాదం, పాకిస్థాన్ అనే ప‌దాలను బీజేపీ నేత‌లు ఎక్కువ‌గా ఉచ్ఛ‌రిస్తార‌ని చెప్పారు. 2019 త‌ర్వాత తెలంగాణ‌కుగానీ, ప్ర‌త్యేకించి హైద‌రాబాద్‌కుగానీ కేంద్ర ప్ర‌భుత్వం ఇచ్చేందేమీ లేని ఓవైసీ మండిప‌డ్డారు.