బీజేపీ జీహెచ్ఎంసీ పీఠాన్ని కైవసం చేసుకుంటుంది: కిషన్ రెడ్డి

వాస్తవం ప్రతినిధి :గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలో జరుగుతోన్న ఎన్నికల్లో బీజేపీ విజయం సాధిస్తుందని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ఈ రోజు హైదరాబాద్‌లోని ప్రెస్‌క్లబ్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ… జీహెచ్‌ఎంసీ ఎన్నికల నేపథ్యంలో సీఎం కేసీఆర్ ఎన్నో హామీలు గుప్పిస్తున్నారని విమర్శించారు. ఉన్న స్పోర్ట్ కాంప్లెక్స్‌ల అభివృద్ధికే దిక్కులేదు కానీ కొత్తవి నిర్మిస్తామని ఆయన చెబుతున్నారని అన్నారు.

బీజేపీ జీహెచ్ఎంసీ పీఠాన్ని కైవసం చేసుకుంటుందని కేంద్ర కిషన్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. అంబర్ పేట్, బాగ్ అంబర్ పేట్, హిమాయత్ నగర్ డివిజన్ బీజేపీ అభ్యర్థుల ఎన్నికల కార్యాలయాలను కిషన్ రెడ్డి ప్రారంభించారు. గత ఎన్నికల్లో డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు సహా అనేక వాగ్ధానాలు చేసి గెలుపొందిన టీఆర్ఎస్.. వాటిని అమలు పరచడంలో విఫలమైందన్నారు. ఇక రూ.67వేల కోట్లతో అభివృద్ధి చేశామంటున్నారు.. కనీసం రోడ్లపై గుంతలు కూడా పూడ్చలేరా? అని ప్రశ్నించారు. కనీసం ప్రజలకు మౌలిక సదుపాయాలను కల్పించాలేకపోయరని అన్నారు. ప్రస్తుతం బీజేపీ మీద విశ్వాసంతో అన్ని పార్టీల నుంచి నాయకులు, కార్యకర్తలు బీజేపీలో చేరుతున్నారని, గ్రేటర్ యువత బీజేపీని గెలిపించబోతున్నారని వ్యాఖ్యానించారు.