కరోనా రోగులకు రెమిడెసివిర్‌ తో ప్రయోజనం లేదు.. ఇవ్వకండి : WHO

వాస్తవం ప్రతినిధి: కరోనా మహమ్మారి జోరు రోజురోజుకి పెరుగుతూనే ఉన్నాయి. ప్రతిరోజూ వేల కొద్ది కేసులు వెలుగులోకి వస్తున్నాయి. ఇప్పటికే ఈ మహమ్మారి వెలుగులోకి వచ్చి ఏడాది దాటిపోయినా కూడా సరైన వ్యాక్సిన్ ఇంకా కనిపెట్టలేకపోతున్నారు. ఇప్పటికి వ్యాక్సిన్లు ఇంకా ప్రయోగ దశలోనే ఉన్నాయి. అయితే ప్రస్తుతం కరోనా పేషేంట్స్ కి ఎక్కువగా ఇచ్చే వ్యాక్సిన్ యాంటీవైరల్ డ్రగ్ రెమిడెసివిర్. అయితే ఈ యాంటీవైరల్ డ్రగ్ రెమిడెసివిర్ పై తాజాగా ప్రపంచ ఆరోగ్య సంస్థ కీలక వ్యాఖ్యలు చేసింది. కరోనా వైరస్‌ చికిత్సలో ప్రాచుర్యం పొందిన యాంటీవైరల్ మెడిసిన్ రెమిడిసివిర్‌ను ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) శుక్రవారం సస్పెండ్ చేసింది. కరోనా చికిత్సలో సత్ఫలితాలు ఇస్తోందని ఇన్నాళ్లూ భావిస్తూ వచ్చిన యాంటీ వైరల్‌ డ్రగ్‌ రెమిడెసివిర్‌తో కలిగే ప్రయోజనం ఏమీ లేదని డబ్ల్యూహెచ్‌వో తాజాగా తెలిపింది. ఆస్పత్రిలో చేరిన కోవిడ్‌ రోగులకు రెమిడెసివిర్‌ ఇవ్వొద్దని వైద్యులకు సూచించింది. ఈ ఔషధంతో రోగుల ప్రాణాలు కాపాడగలమనడానికి ఆధారాలు లేవని పేర్కొంది.