ఆక్స్ ఫర్డ్ కరోనా వ్యాక్సిన్ .. రెండు డోస్ ల ధర రూ. 1000

వాస్తవం ప్రతినిధి: కరోనావైరస్ ధాటికి ప్రపంచం మొత్తం విలవిల్లాడుతోంది. ఈ మహమ్మారికి విరుగుడు వ్యాక్సిన్ కనుక్కోవడానికి ప్రపంచ వ్యాప్తంగా దిగ్గజ ఫార్మ కంపెనీలు పోటీ పడుతున్నాయి. ఇందులో ఆక్స్ ఫర్డ్ అందరికన్నా ముందు ఉంది. అయితే, ఆక్స్ ఫర్డ్, అస్ట్రాజెనికాలు తయారు చేసిన కరోనా వ్యాక్సిన్ ను ఇండియాలో తయారు చేసేందుకు డీల్ కుదుర్చుకున్న సీరమ్ ఇనిస్టిట్యూట్, ఫిబ్రవరి 2021లో దీన్ని అందుబాటులోకి తెస్తామని ప్రకటించింది. దీనికి సంబంధించి సీరమ్ ఇనిస్టిట్యూట్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అదర్ పూనావాలా కీలక ప్రకటన చేశారు. మొదటి దశలో హెల్త్ కేర్ వర్కర్లకు, వయో వృద్ధులకు వ్యాక్సిన్ ఇస్తామని .. ఆ తర్వాత ఏప్రిల్ నాటికి సామాన్య ప్రజలకు టీకా అందుబాటులోకి వస్తుందన్నారు. ఈ వ్యాక్సిన్ రెండు డోస్ ల ధర రూ. 1000 వరకూ ఉంటుందని అదర్ పూనావాలా తెలిపారు.