పాక్ లో 1300 ఏళ్ల నాటి పురాత‌న హిందూ దేవాల‌యం..!

వాస్తవం ప్రతినిధి: పాకిస్థాన్‌లో పురావ‌స్తు శాఖ త‌వ్వ‌కాల్లో 1300 ఏళ్ల నాటి పురాత‌న హిందూ దేవాల‌యం బ‌య‌ట‌ప‌డింది. వాయువ్య పాకిస్థాన్‌లోని స్వాత్‌ జిల్లాలోని బారీకోట్‌ ఘుండాయ్‌ ప్రాంతంలో ఒక పర్వతం వద్ద పాక్‌, ఇటాలియన్‌ పురావస్తు నిపుణులు జరుపుతున్న తవ్వకాల్లో దీనిని కనుగొన్నారు. ఇది దాదాపు 1300 ఏళ్ల క్రితం హిందూ షాహీలు నిర్మించిన విష్ణు దేవాలయమని ఖైబర్‌ పఖ్తున్ఖ్వా పురావస్తు శాఖకు చెందిన ఫజల్‌ ఖలీక్‌ చెప్పారు. హిందూ షాహి రాజ్యంలో 1300 ఏళ్ల కింద‌ట ఈ ఆల‌యాన్ని నిర్మించిన‌ట్లు ఆయ‌న తెలిపారు.

ఈ హిందూ షాహీస్ లేదా కాబూల్ షాహీస్ ఒక హిందూ రాజ్య‌వంశం. క్రీస్తు శ‌కం 850-1026 మ‌ధ్య ఈ వంశ‌స్థులు కాబూల్ లోయ‌, గాంధారా (ఇప్ప‌టి పాకిస్థాన్‌), వాయ‌వ్య భార‌త్ ప్రాంతాన్ని ప‌రిపాలించారు. స్వాట్ జిల్లాలో వెయ్యేళ్ల కింద‌టి పురావ‌స్తు ప్ర‌దేశాలు ఉండ‌గా.. తొలిసారి హిందూ షాహీస్ నాటి జాడలు కనిపించాయ‌ని ఆ అధికారి చెప్పారు.