రూల్స్ ప్రకారం నడుచుకోవాల్సిందే.. చైనా, WHO పై బైడెన్ కీలక వ్యాఖ్యలు..!!

వాస్తవం ప్రతినిధి: డెలావేర్​లోని విల్మింగ్టన్​లోను తన సొంతూరులో గవర్నర్ల బృందంతో జరిగిన సమావేశంలో అమెరికాకు కొత్తగా ఎన్నికైన ప్రెసిడెంట్ జో బైడెన్ మాట్లాడారు.. మీడియా అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలిచ్చారు.

డ్రాగన్ దేశంపై ఎకనమిక్ శాంక్షన్స్, టారిఫ్​లు విధిస్తారా? అని మీడియా ప్రశ్నించగా.. “ఇక్కడ చైనాను శిక్షించడం అనేది విషయం కాదు. రూల్స్ ప్రకారం నడుచుకోవాలని ఆ దేశం అర్థం చేసుకునేలా చూసుకోవడం ముఖ్యం. ఇది చాలా సింపుల్​ ప్రపోజల్” అని బదులిచ్చారు. కొన్ని నెలల కిందట అమెరికా WHO నుంచి బయటికొచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తాము WHOలో తిరిగి చేరుతామని బైడెన్ అన్నారు. “మేం అధికారం చేపట్టిన మొదటి రోజే డబ్ల్యూహెచ్ఓలో చేరుతాం. అలాగే పారిస్ ఒప్పందంలో కూడా తిరిగి చేరుతాం. మిగతా ప్రపంచంతో కలిసి ముందుకు సాగుతున్నామనే విషయాన్ని మనం చాటిచెప్పాలి” అని కామెంట్ చేశారు.