కాంట్రాక్ట్‌ నిబంధనలను సవరించిన బీసీసీఐ

వాస్తవం ప్రతినిధి: భారత క్రికెట్‌ కంట్రోల్‌ బోర్డు (బీసీసీఐ) తమ కాంట్రాక్ట్‌ నిబంధనలను సవరించింది. ఇకనుంచి టీమిండియా తరఫున ఆడే టీ20 ఆటగాళ్లు కూడా సెం ట్రల్‌ కాంట్రాక్ట్‌ పొందనున్నారు. టీమిండియా తరఫున ఆడే టీ20 ఆటగాళ్లు పొందవచ్చు.. అయితే దీనికోసం ఆటగాడు కనీసం 10టీ20లు టీమిండియా తరఫున ఆడాల్సి ఉంటుంది. కాగా గతంలో బీసీసీఐ వార్షిక ఒప్పందాలు కేవలం వన్డే క్రికెటర్లు లేదా టెస్టుల్లో ఆడే క్రికెటర్లకు మాత్రమే ఉండేది. తాజాగా టీ20క్రికెటర్లకు కూడా బీసీసీఐ సెంట్రల్‌ కాంట్రాక్ట్‌ అందజేయ నుంది. గతంలోనే సుప్రీంకోర్టు నియమించిన క్రికెట్‌ పాలక కమిటీ (సీఓఎ) టీ20 ఫార్మాట్‌కు కూడా కాంట్రాక్ట్‌ను వర్తింపజేయాలని సూచించినా బోర్డు సుముఖత వ్యక్తం చేయలేదు. అయితే గూంగూలీ సారథ్యంలోని బోర్డు ఈ ప్రతిపాదనకు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. ప్రస్తుతం 4కేటగిరీల్లో కాంట్రాక్ట్‌లు ఉండగా ఏప్లస్‌ కేటగిరీలో ఉన్నవారికి ఏడాదికి రూ.7కోట్లు, ఏ కేటగిరిలో ఉన్న వారికి రూ.5కోట్లు, బీ కేటగిరిలో ఉన్నవారికి ఏడాదికి రూ.3కోట్లు, సీ కేటగిరిలో ఉన్నవారికి రూ.కోటి వార్షిక వేతనంగా బీసీసీఐ అందజేస్తోంది.