చిరంజీవి సినిమాలో చరణ్ విలన్..!!

వాస్తవం సినిమా: మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో “ఆచార్య” అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో చిరంజీవితో పాటు చరణ్ కూడా దాదాపు అరగంట పాటు కలిగిన ఓ క్యారెక్టర్ చేస్తున్నారు. కరోనా కారణంగా సినిమాకి సంబంధించి షూటింగ్ మొన్నటి వరకు వాయిదా పడగా తాజాగా సరికొత్త షెడ్యూల్ తో రెడీ కానుంది.

ఇదిలావుండగా గతంలో మాదిరిగానే కొరటాల “ఆచార్య” సినిమా ని మెసేజ్ ఓరియెంటెడ్ సినిమా తరహాలో తెరకెక్కిస్తూనట్లు వార్తలు వస్తున్నాయి. ఇదిలా ఉండగా గతంలో చరణ్ నటించిన ధ్రువ సినిమా లో విలన్ గా చేసిన అరవింద్… “ఆచార్య” సినిమాలో విలన్ గా చేస్తున్నట్లు లేటెస్ట్ వార్త ఇండస్ట్రీలో వైరల్ అవుతుంది. త్వరలోనే అరవింద్ పై సినిమా యూనిట్ సన్నివేశాలు చిత్రీకరించనున్నాట్లు వార్తలు వస్తున్నాయి. ఇదిలా ఉండగా ఈ సారి మాత్రం చాలా స్పీడ్ గా ఈ సినిమాని కంప్లీట్ చేయడానికి డైరెక్టర్ కొరటాల పక్కా షెడ్యూల్ ప్రిపేర్ చేసుకుని ఉన్నట్లు ఫిలింనగర్ లో వార్తలు వస్తున్నాయి. దాదాపు ఈ సినిమా కోసం కొరటాల రెండు సంవత్సరాల పాటు టైం కేటాయించడంతో.. మరోపక్క ఇతర కథలను కూడా సెట్ చేసుకుంటున్నట్లు సమాచారం.