బన్నీ లుక్ చూసి బాబోయ్ ఉర మాస్.. అని అంటున్నారు..!!

వాస్తవం సినిమా: ఈ ఏడాది ప్రారంభంలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ “అల వైకుంఠపురం లో” సినిమా తో అదిరిపోయే విజయాన్ని తన ఖాతాలో వేసుకున్న సంగతి తెలిసిందే. కరోనా రావడంతో ఇండస్ట్రీలో పరిస్థితులు మారటంతో.. ప్రస్తుతం ఎలాంటి పెద్ద సినిమా రిలీజ్ కావడంతో ఈ ఏడాది బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ సినిమాగా “అల వైకుంఠపురం లో” నిలిచిపోయింది. ఇదిలా ఉండగా ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ పుష్ప అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. సినిమాలో అల్లు అర్జున్ లారీ డ్రైవర్ పాత్రలో గంధపు చెక్కల స్మగ్లర్ గా నటించనున్నాడట. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించి రిలీజైన ఫస్ట్ లుక్ పోస్టర్ కి మంచి రెస్పాన్స్ అభిమానుల నుండి వచ్చిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా తాజాగా సినిమా షూటింగ్ జరుగుతున్న సమయంలో రిలీజ్ అయిన అల్లు అర్జున్ లుక్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. పక్కా మాస్ లుక్ తో ఈ ఫోటోలో అల్లు అర్జున్ కనిపించి అభిమానులందరికీ సర్ప్రైజ్ ఇచ్చాడు. మాసిన జుట్టు గడ్డం మట్టితో నిండిన బట్టలతో షూటింగ్ లో పాల్గొన్నాడు అల్లు అర్జున్. ఇక ఈ ఫోటో చూసిన అభిమానులు బన్నీ చాలా మొరటుగా ఉన్నాడని, సుకుమార్ బన్నీ క్యారెక్టర్ ని ఉర మాస్ తరహాలో తీర్చిదిద్దాడని అంటున్నారు. తాజాగా రిలీజ్ అయిన ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. పుష్ప కూడా గ్యారెంటీగా బ్లాక్ బస్టర్ అవుతుందని అంటున్నారు.