మరోసారి మహేష్ బాబు తో అనుష్క..??

వాస్తవం సినిమా: సూపర్ స్టార్ మహేష్ బాబు టాలీవుడ్ ఇండస్ట్రీలో వరస విజయాల మీద ఉన్నారు. టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర హ్యాట్రిక్ బ్లాక్ బస్టర్ విజయాలను నమోదు చేసుకుని దూసుకుపోతున్నారు. ప్రస్తుతం “గీతా గోవిందం” డైరెక్టర్ పరుశురాం దర్శకత్వంలో “సర్కారు వారి పాట” అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. సినిమాకి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ తన తండ్రి సూపర్ స్టార్ కృష్ణ పుట్టిన రోజు నాడు విడుదల చేసి తన సరికొత్త మేకోవర్ తో అభిమానులను మహేష్ అలరించడం జరిగింది.

కాగా ఈ సినిమా స్టోరీ బ్యాంకింగ్ రంగంలో మోసాల కు సంబంధించిన స్క్రిప్ట్ అని ఫిలింనగర్ లో వార్తలు వస్తున్నాయి. ఇదిలా ఉండగా ఈ సినిమాలో తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం మహేష్ సరసన ఓకే లక్క క్యారెక్టర్లో అనుష్క నటించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. వినపడుతున్న సమాచారం ప్రకారం ఓ బ్యాంక్ ఆఫీసర్ పాత్రలో అనుష్క సినిమాలో కనిపించనుందని ఫిలిం నగర్ టాక్. గతంలో అనుష్క త్రివిక్రమ్ దర్శకత్వంలో మహేష్ నటించిన ఖలేజా సినిమాలో నటించడం జరిగింది. ఆ సినిమా పెద్దగా ఆడలేదు. తర్వాత వీరిద్దరి కాంబినేషన్ లో కూడా సినిమాలు ఏమీ రాలేదు. అయితే తాజాగా మరోసారి అనుష్క పక్కన మహేష్ నటిస్తున్నట్లు ఈ వార్త సోషల్ మీడియాలో రావడంతో మహేష్ అభిమానులు నిజమా అబద్దమా అంటూ తెగ డిస్కషన్లు చేసుకుంటున్నారు.