“నీ వెకిలివేషాలు ప్రదర్శించడానికి ఇదేమీ జబర్దస్త్ షో కాదు… రోజా కి దివ్యవాణి కౌంటర్ !

వాస్తవం ప్రతినిధి: అసలు చంద్రబాబు గురించి మాట్లాడ్డానికి ఒక స్థాయి ఉండాలని, రోజాకు అది లేదని , జగన్ మెప్పు కోసం చంద్రబాబును చులకనగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు టీడీపీ మహిళా నేత దివ్యవాణి .

టీడీపీ అధినేత చంద్రబాబు జీవితమంతా వెన్నుపోట్లు, శవరాజకీయాలేనంటూ వైసీపీ ఎమ్మెల్యే రోజా తిరుమలలో వ్యాఖ్యానించడం తెలిసిందే. దీనిపై దివ్యవాణి ఘాటుగా స్పందించారు.

శవరాజకీయాల గురించి, సంప్రదాయాల గురించి రోజా మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు. గతంలో టీడీపీలో ఉన్నప్పుడు వైఎస్సార్ ను పంచలూడదీసి కొడతానని వ్యాఖ్యానించిందీ, కేసీఆర్ ను తాగుబోతు అన్నదీ ఈ రోజాయేనని, ఇప్పుడు పార్టీలో తన పరపతి పెంచుకోవడం కోసం, పదవుల కోసం అందితే జుట్టు, అందకపోతే కాళ్లు అనే రీతిలో రోజా దిగజారిపోయిందని దివ్యవాణి విమర్శించారు.

చంద్రబాబు గురించి మాట్లాడేటప్పుడు కాస్త ఒళ్లు, నోరు దగ్గరపెట్టుకోవాలని హెచ్చరించారు. “నీ వెకిలివేషాలు ప్రదర్శించడానికి ఇదేమీ జబర్దస్త్ షో కాదు… శవరాజకీయాలకు కేరాఫ్ అడ్రస్ వైసీపీనే. అలాంటి పార్టీలో ఉన్న నువ్వు శవరాజకీయాల గురించి మాట్లాడుతున్నావా?” అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

నాడు నంద్యాలలో భూమా అఖిలప్రియ వేసుకున్న దుస్తులను విమర్శించినప్పుడు ప్రజలు చీపుర్లతో కొట్టి, నీ మొహాన పేడనీళ్లు కొట్టారన్న విషయం మర్చిపోయి, ఇవాళ తిరుపతి ఉప ఎన్నిక గురించి నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నావు అంటూ దివ్యవాణి నిప్పులు చెరిగారు.