కరోనాతో టెర్రరిస్టులు సరికొత్త ప్రయోగం..!!

వాస్తవం ప్రతినిధి: కరోనా సెకండ్ వేవ్ చాలా ప్రమాదకరంగా ఉన్నట్లు వైద్యులు తెలుపుతున్నారు. యూరప్ మరియు అమెరికా దేశాలలో ఊహించని విధంగా పాజిటివ్ కేసులు బయటపడటంతో ప్రభుత్వాలు తెగ ఆందోళన చెందుతున్నాయి.

ఇదిలా ఉండగా ఈ మహమ్మారిని అడ్డంపెట్టుకుని ఉగ్రవాదులు సరికొత్త ప్రయోగాలు చేస్తున్నట్లు ఐక్యరాజ్యసమితికి చెందిన (యునైటెడ్ నేషన్స్ ఇన్టర్ రీజినల్ క్రైమ్ అండ్ జస్టిస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ) యూఎన్ఐసీఆర్ఐ ఆందోళన వ్యక్తం చేస్తోంది.

పూర్తి మేటర్ లోకి వెళ్తే కొన్ని ఉగ్రవాద సంస్థలకు చెందిన సభ్యులు కావాలని తమకి కరోనా సోకేలా చేసుకుని తరువాత వైరస్ బాంబుల్లా తయారవుతున్నారని పేర్కొంది. అంతేకాకుండా వీళ్లంతా జన సముద్రం లోకి వచ్చి సాధారణ మనుషుల్లాగా చలామణి అవుతూ మాస్క్ లు ధరించకుండా..జనసాంద్రత ఎక్కువ ఉన్నచోట బహిరంగంగా తుమ్మడం, దగ్గడం వంటి చర్యలకు పాల్పడతారని, దీని ద్వారా ప్రజల్లో ఈ మృత్యుకారక వైరస్ మరింత వ్యాపించేందుకు ప్రయత్నిస్తున్నారని యూఎన్ఐసీఆర్ఐ తన నివేదికలో పేర్కొంది. కాబట్టి ప్రభుత్వాలు అప్రమత్తంగా ఉండాలి, ప్రజలంతా కరోనా నిబంధనలను పాటించేలా చర్యలు తీసుకోవాలని ఐక్యరాజ్యసమితి సూచించింది.