ఈ నెల 27వ తేదీన ఏపీ మంత్రివర్గ సమావేశం

వాస్తవం ప్రతినిధి: గ్రేటర్ ఎన్నికల్లో టీఆర్ఎస్ కి ఓట్లు వేసి గెలిపించాలని… టీఆర్ఎస్ అభ్యర్థిని మేయర్ గా గెలిపించాలని కోరుతున్నానని సినీ నటుడు పోసాని కృష్ణ మురళి కోరారు. దేశంలోని అన్ని రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలు ప్రజా సేవ బాగానే చేస్తున్నాయని అన్నారు. 35 ఏళ్ల నుంచి ఎంతో మంది నాయకులు, ముఖ్యమంత్రులను చూసాను, హైదరాబాద్ అంటేనే.. మత ఘర్షణలు వస్తాయి అని చెప్పుకునేవాళ్ళని అన్నారు. ఎన్టీఆర్ ముఖ్యమంత్రి అయ్యాక మత ఘర్షణలు తగ్గాయని, ఎన్టీఆర్ తర్వాత… కేసీఆర్ హయాంలోనే లా అండ్ ఆర్డర్ మెరుగ్గా ఉందని అన్నారు. మత ఘర్షణలకు తావు లేదని అన్నారు. హైదరాబాద్ ప్రజలు సురక్షితంగా ఉండగలుగుతున్నారు అంటే.. కేసీఆర్ వల్లనేనని ఆయన అన్నారు.