తమిళనాడులో సరికొత్త వ్యూహాలు సిద్ధం చేస్తున్న అమిత్ షా..!!

వాస్తవం ప్రతినిధి: త్వరలో తమిళనాడులో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలలో ఎలాగైనా గెలవడానికి ప్రధాన పార్టీలు రెడీ అవుతున్నాయి. తాజా సర్వేల ఫలితాల ఆధారంగా చూసుకుంటే ఖచ్చితంగా రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే గెలవటం గ్యారెంటీ అనే టాక్ వస్తోంది.

ఇదిలా ఉండగా ఎలాగైనా తమిళనాడులో మరోసారి పట్టు నిలబెట్టుకోవడానికి బీజేపీ హైకమాండ్ నాయకులు వ్యూహాలను సిద్ధం చేస్తున్నారు. దీనిలో భాగంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆధ్వర్యంలో నేడు తమిళనాడులో కీలక భేటీలు జరగనున్నట్లు తెలుస్తోంది. ముందుగా సూపర్ స్టార్ రజినీకాంత్ తో భేటీ కానున్నట్లు ఆతర్వాత డీఎంకే మాజీ అధ్యక్షుడు అళగిరితో అమిత్ షా భేటి అవుతారని సమాచారం.

ఈ క్రమంలో ఇద్దరి నేతల ని అన్నాడీఎంకే-బీజేపీ కూటమికి మద్దతు ప్రకటించాలని షా కోరనున్నట్లు వార్తలు వస్తున్నాయి. వీరిద్దరితో భేటీ అయిన తర్వాత ఏఐడీఎంకే ముఖ్య నేతలతో అమిత్ షా భేటీ కానున్నారు. ఏది ఏమైనా వచ్చే ఏడాది మే లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలలో మెజార్టీ సీట్లు దక్కించుకోవడానికి బిజెపి అన్ని అవకాశాలను ఉపయోగించుకోవడానికి అనేక ప్రయత్నాలు చేస్తున్నట్లు తాజా పరిణామాలను బట్టి తెలుస్తోంది.