కేసీఆర్ పై గద్దర్ ప్రశంసల వర్షం

వాస్తవం ప్రతినిధి: ముఖ్యమంత్రి కేసీఆర్‌ గొప్ప ప్రజా నాయకుడు, పాలనాదక్షుడని ప్రజా గాయకుడు గద్దర్‌ అన్నారు. దేశ రాజకీయాల గతిని సమూలంగా మార్చాల్సిన అవసరం ఉందని, ఇందుకు గాను కేసీఆర్‌ ఫెడరల్‌ ఫ్రంట్‌ ఏర్పాటు చేస్తే దానికి అనుబంధంగా కల్చరల్‌ ఫ్రంట్‌ పెట్టడం ద్వారా సంపూర్ణ మద్దతునిస్తానన్నారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల ప్రచారం సందర్భంగా టీఆర్‌ఎస్‌ వెంకటాపురం డివిజన్‌ ఇంఛార్జిగా వ్యవహరిస్తున్న మంత్రి కొప్పుల‌ గద్దర్‌ను ఆయన నివాసంలో మర్యాద పూర్వకంగా కలిశారు ఈ సందర్భంగా గద్దర్ కేసీఆర్ పై ప్రశంసల వర్షం కురిపించారు. కాళేశ్వరం సాగునీటి ప్రాజెక్టు ద్వారా రాష్ట్రంలోని దాదాపు సగభాగం సస్యశ్యామలంగా మారిందన్నారు. రైతులు, ప్రజలు సంతోషిస్తున్నారని కొనియాడారు.