ప్రచారానికి పెద్ద పీట వేస్తూ భారీగా ఖర్చు అంటూ కేసీఆర్ సర్కార్ పై ఆరోపణలు ..??

వాస్తవం ప్రతినిధి: తెలంగాణ రాష్ట్రంలో టిఆర్ఎస్ పార్టీకి బీజేపీ నేతల మధ్య మాటల తూటాలు గట్టిగా పేలుతున్నాయి. గ్రేటర్ ఎన్నికలకు సంబంధించి ఈ రెండు పార్టీలు నువ్వా నేనా అన్నట్టు గా పోటీపడుతున్నాయి. ఇదిలా ఉండగా వరద సహాయం విషయంలో కేంద్ర ప్రభుత్వం అడ్డుకుందని ఆరోపణలు చేస్తూ ఉన్న సంగతి తెలిసిందే.

ఇదిలా ఉండగా 2014 నుంచి 2018 అక్టోబర్ మధ్య కాలంలో కేసీఆర్ సర్కార్ దాదాపు ప్రచారం కోసం పెట్టిన ఖర్చు ఏకంగా రూ.310.7కోట్లు అని సొసైటీ ఫర్ సేఫ్టీ ఆఫ్ పబ్లిక్ అండ్ గుడ్ గవర్నెన్స్ సంస్థ సమాచార హక్కు చట్టం ప్రకారం సమాచారం బయటపడింది. రోడ్డు వెంట హోర్డింగులు.. పోస్టర్లు.. టీవీ చానళ్లు.. ఇలా వేటికెంత ఖర్చు చేశారన్న వివరాలు ఉన్నాయి. అవుట్ డోర్ ప్రకటనలకు రూ.190 కోట్లు ఖర్చు చేయగా.. జాతీయ టీవీ చానళ్లలో ప్రకటనల కోసం రూ.119 కోట్లు ఖర్చు చేసినట్లు గుర్తించారు. అదే విధంగా తెలంగాణలో ప్రభుత్వం ఆధ్వర్యంలో వచ్చిన పండుగలకు భారీ స్థాయిలో ఖర్చు చేసినట్లు లెక్కలు బయటకు వచ్చాయి.

మొత్తం మీద చూస్తే కేసీఆర్ సర్కార్ పబ్లిసిటీ కోసం భారీగానే ఖర్చు చేసినట్లు లెక్కలు బయటపడ్డాయి. దీంతో టిఆర్ఎస్ ప్రభుత్వం పై ఇతర పార్టీల నాయకులు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. ప్రచారం తప్ప పనులలో టిఆర్ఎస్ ప్రభుత్వం పెద్దగా రాణించింది లేదు అంటూ తాజాగా వచ్చిన వార్తల పై కామెంట్లు చేస్తున్నారు.