ఏపీ సర్కార్ పై సీరియస్ అయిన హైకోర్ట్..!!

వాస్తవం ప్రతినిధి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వానికి ప్రతిపక్షాల నుండి కంటే న్యాయస్థానాల నుండే ఎక్కువ మొట్టికాయలు పడ్డాయి. ముఖ్యమంత్రి జగన్ తీసుకున్న చాలా నిర్ణయాలు న్యాయస్థానాలలో అట్టర్ ఫ్లాప్ అయ్యాయి. ఈ క్రమంలో కొంతమంది వైసీపీ పార్టీకి చెందిన నేతలు న్యాయ స్థానాలపై కాంట్రవర్సి కామెంట్లు చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇదిలా ఉంటే తాజాగా ఏపీ సర్కార్ పై శుక్రవారం హైకోర్టు మండిపడింది. పూర్తి మేటర్ లోకి వెళ్తే నిరసనల

కు సంబంధించి దాఖలైన హెబియస్ కార్పస్ వ్యాజ్యాలపై శుక్రవారం కోర్టు విచారణ చేపట్టింది. రాజధాని అమరావతి అభివృద్ధి కోసం 3 వేల కోట్లు ఖర్చు చేశాక ఇప్పుడు తరలిస్తామనడం నిజంగా ప్రభుత్వ మతిలేని చర్యేనని అని పేర్కొంది. కొన్ని వేల కోట్లు ఖర్చు చేసిన తర్వాత ఎక్కడి పనులు అక్కడే నిలిపివేయడం ఏంటి అంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ప్రజా ధనాన్ని ఈ విధంగా దుర్వినియోగం చేయటం వల్ల అంతిమంగా నష్టపోయేది ప్రజలే నని న్యాయస్థానం వ్యాఖ్యానించింది.

అదే విధంగా అమరావతి ప్రాంతంలో నిర్మాణంలో ఉన్న భవనాల పనులను ఆపివేయడం పట్ల కూడా వైసీపీ ప్రభుత్వం పై హైకోర్టు న్యాయ స్థానం మండిపడింది. అదేవిధంగా ప్రజా చైతన్య యాత్ర కు అప్పట్లో విశాఖపట్టణానికి వెళ్లిన చంద్రబాబుని సీఆర్‌పీసీ సెక్షన్‌ 151 కింద నోటీసిచ్చి అరెస్ట్‌ చేయడాన్ని కూడా కోర్టు తప్పుపట్టడం జరిగింది.