కేసీఆర్ సర్కార్ పై కీలక వ్యాఖ్యలు చేసిన పోసాని కృష్ణ మురళి..!!

వాస్తవం ప్రతినిధి: టాలీవుడ్ ఇండస్ట్రీ సీనియర్ నటుడు పోసాని కృష్ణ మురళి తాజాగా కెసిఆర్ ప్రభుత్వం పై కీలక వ్యాఖ్యలు చేశారు. భాను హైదరాబాద్ నగరంలో 35 సంవత్సరాల నుండి ఉంటున్నట్లు చెప్పుకొచ్చిన పోసాని ఎంతో మంది ముఖ్యమంత్రులు నాయకులను చూశానని చెప్పుకొచ్చారు. అయితే హైదరాబాద్ నగరంలో మతఘర్షణలు ఎన్టీఆర్ హయాంలో చాలా కంట్రోల్ లో ఉండే వాణ్ణి, ఆ తర్వాత కేసీఆర్ వచ్చాకే నగరంలో లా అండ్ ఆర్డర్ కరెక్ట్ గా ఉందని పోసాని చెప్పుకొచ్చారు. గ్రేటర్ ఎన్నికల నేపథ్యంలో మీడియాతో మాట్లాడిన పోసాని కృష్ణ మురళి… టీఆర్ఎస్ పార్టీకి ఓటు వేసి గెలిపించాలని కోరారు. అంతేకాకుండా టిఆర్ఎస్ పార్టీ అభ్యర్ధి ని మేయర్ చేయాలని నిర్ణయించారు. హైదరాబాద్ నగరంలో గతంలో అనేక మత ఘర్షణలు జరిగాయి, ప్రస్తుతం సురక్షితంగా , ప్రశాంతంగా నగరం ఉంది అంటే దానికి కారణం కేసీఆర్ ప్రభుత్వమని పోసాని చెప్పుకొచ్చారు. కాబట్టి గ్రేటర్ ఎన్నికలలో నగర ప్రజలంతా టిఆర్ఎస్ పార్టీకి పట్టం కట్టాలని పోసాని సూచించారు. దేశంలో చాలా ప్రాంతాలను పార్టీలు ప్రజాసేవ బాగా చేస్తున్నాయని వాటిలో టిఆర్ఎస్ పార్టీ కూడా ఒకటి అంటూ పోసాని చెప్పుకొచ్చారు. ఏది ఏమైనా గ్రేటర్ ఎన్నికలలో టిఆర్ఎస్ పార్టీ గెలవాలని తాను ఆశిస్తున్నట్లు మీడియాతో తెలిపారు.