స్పీకర్ తమ్మినేని సీతారాంకి తప్పిన పెను ప్రమాదం

వాస్తవం ప్రతినిధి: స్పీకర్ తమ్మినేని సీతారాంకి పెను ప్రమాదం తృటిలో తప్పింది. శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలస మండలం వాకలవలస వద్ద తమ్మినేని కారు ఆటోను ఢీకొట్టింది. దీంతో ఆటో పూర్తిగా ధ్వంసమైంది. ప్రయాణికులు మాత్రం సురక్షితంగా ఉన్నారు. స్పీకర్ కాన్వాయ్ వాహనం స్వల్పంగా దెబ్బతిన్నది. తమ్మినేనితో పాటు ఎవ్వరికీ ఎలాంటి ఇబ్బంది తలెత్తక పోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.