మృతి చెందిన తిరుపతి ఎంపి కుమారుడికి ఎమ్మెల్సీ పదవి..!!

వాస్తవం ప్రతినిధి: తిరుపతి ఉప ఎన్నిక విషయంలో కసరత్తు మొదలుపెట్టింది అధికార పార్టీ వైసిపి. ఎమ్.పిగా ఉన్న బల్లి దుర్గా ప్రసాద్ మరణించటంతో త్వరలో జరగబోయే ఉప ఎన్నిక విషయంలో ప్రధాన పార్టీలన్నీ సిద్ధమవుతున్నాయి. ఇప్పటికే టీడీపీ ఎంపీ అభ్యర్థిగా పోటీకి కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మి పోటీ చేస్తున్నట్లు ఆ పార్టీ ప్రకటించిన సంగతి తెలిసిందే.

రిజర్వుడు నియోజకవర్గం కావడంతో అధికార పార్టీ వైసిపి ఎవరిని పోటీ పెడదాము అనేదానిపై అన్వేషణ స్టార్ట్ చేసింది. ఈ క్రమంలో వైసీపీ అధినేత జగన్ మృతి చెందిన బల్లి దుర్గా ప్రసాద్ కుటుంబం వారితో మాట్లాడారు. ఈ నేపథ్యంలో దుర్గా ప్రసాద్ కుమారుడు కళ్యాణ్ కు ఎమ్మెల్సీ పదవి ఇస్తామని ఈ సందర్భంగా జగన్ హామీ ఇచ్చారని మంత్రి బొత్స తెలిపారు. ఆ కుటుంబానికి పార్టీ అండగా ఉంటుందని ఆయన అన్నారు.

కాగా జగన్ నిర్ణయంపై బల్లి దుర్గా కుమారుడు కళ్యాణ్ మాట్లాడుతూ తాము జగన్ తో సుదీర్ఘ ప్రయాణం చేయాలని భావిస్తున్నామని అన్నారు.తనకు ఎమ్మెల్సీ పదవి ఇస్తామని చెప్పినందుకు కళ్యాణ్ కృతజ్ఞతలు తెలిపారు. కాగా తిరుపతి లోకసభ నియోజకవర్గం నుండి వైసీపీ పార్టీ తరఫున ఎంపీగా పోటీ చేయడానికి చాలామంది వెయిట్ చేస్తున్నట్లు, పార్టీ నేతలతో లాబీయింగ్ జరుపుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీంతో ఎవరికీ జగన్ టికెట్ ఇస్తారో అన్న దాని విషయంలో పార్టీలో సస్పెన్స్ నెలకొంది.