మోదీ ప్రభుత్వం పేద ప్రజల హక్కులను కాలరాస్తోంది: రాహుల్ గాంధీ

వాస్తవం ప్రతినిధి: కేంద్ర ప్రభుత్వంపై కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ మరోసారి ధ్వజమెత్తారు. కరోనా సమయంలో లాక్‌డౌన్ విధింపు తుగ్గక్ చర్య అని, దీంతో చాలా మంది కార్మికులు రోడ్డున పడ్డారని మండిపడ్డారు. ”మొట్ట మొదట తుగ్లక్ చర్య లాంటి లాక్‌డౌన్ విధించారు. దీంతో లక్షలాది మంది కార్మికులు రోడ్డున పడ్డారు. నరేగా ద్వారా వచ్చే డబ్బులను కూడా బ్యాంకుల నుంచి తీసుకోవడం కార్మికులకు కష్టతరమైంది. మోదీ ప్రభుత్వానివి కేవలం మాటలే. పేద ప్రజల హక్కులను కాలరాస్తోంది.” అంటూ రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు.