వాస్తవం ప్రతినిధి: అమెరికాలో కరోనా వ్యాప్తి అంతకంతకూ పెరుగుతోంది. కేసులు, మరణాలు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. తాజాగా అక్కడ మరణాలు 2 లక్షల 50 వేలు దాటిపోయాయి. జాన్స్ హాప్కిన్స్ యూనివర్సిటీ లెక్కల ప్రకారం.. విశ్వవ్యాప్తంగా 13.49 లక్షల మందిని కరోనా బలిగొంటే వారిలో 2.5 లక్షల మంది అమెరికన్లే ఉండడం గమనార్హం. ప్రతి నిమిషానికి ఒక అమెరికన్ కరోనా కాటుకు బలవుతున్నట్టు సీఎన్ఎన్ విశ్లేషించింది.
అసలైన టైమ్లో దేశం తప్పు మార్గంలో పోతోందని, ఈ వింటర్ టైమ్లో జనం గుమికూడుతున్న సందర్భాలు పెరుగుతున్నాయని అమెరికా టాప్ ఇన్ఫెక్షియస్ డిసీజ్ ఎక్స్పర్ట్ డాక్టర్ ఆంటోనీ ఫౌచీ ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుతం దేశం చాలా క్లిష్టమైన పరిస్థితుల్లో ఉందని హెచ్చరించారు. కాగా, అధికార బదలాయింపు ప్రక్రియ ఆలస్యం చేస్తున్న ట్రంప్ వల్ల కొవిడ్ వ్యాక్సిన్ తీసుకొచ్చే ప్రణాళికలు వారాలు లేదా నెలలపాటు ఆలస్యమయ్యే ప్రమాదం ఉందని అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన జో బైడెన్ హెచ్చరించారు.