కమల హ్యారిస్ పై ప్రియాంక ఆసక్తికర ట్వీట్..!!

వాస్తవం ప్రతినిధి: అగ్రరాజ్యం అమెరికా ఉపాధ్యక్షురాలిగా ఎన్నికైన భారత సంతతికి చెందిన కమల హ్యారిస్ కు కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా శుభాకాంక్షలు తెలిపారు. నవంబర్‌ 19న ఇందిరా గాంధీ జయంతి సందర్భంగా ప్రియాంక ఓ ట్వీట్‌ చేశారు. అగ్రరాజ్యంగా చెప్పుకునే అమెరికాకు ఓ మహిళను ఉపాధ్యక్షురాలిగా ఎన్నుకునేందుకు శాతాబ్ధాల సమయం పట్టిందని, భారత్‌లో మాత్రం 50 ఏళ్ల కిందటే ఓ మహిళ (ఇందిరా గాంధీ)ను దేశ ప్రధానిగా ఎన్నుకున్నారని గుర్తుచేశారు. ఇక ఇటీవల జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో అధ్యక్షుడిగా జో బైడెన్‌, ఉపాధ్యక్షురాలిగా కమల హ్యారిస్ విజయం సాధించారు. 2021 జనవరి 20న వారు పదవీ బాధ్యతలు స్వీకరించనున్నారు.