కరోనా నిబంధనలు ఉల్లంఘన..సింగపూర్‌లో ఎన్నారై పై ఛార్జి షీట్ ఫైల్..!

వాస్తవం ప్రతినిధి: కరోనా నిబంధనలు ఉల్లంఘించాడనే కారణంతో సింగపూర్‌లో ఓ భారతీయుడిని పోలీసులు అరెస్ట్ చేసారు. ఇండియాకు చెందిన 25ఏళ్ల పార్థిబన్ బాలచంద్రన్..తనకు కరోనా సోకిందేమో అనే అనుమానంతో సింగపూర్‌లోని జనరల్ హాస్పటల్‌లో కొవిడ్ టెస్ట్ చేయించుకున్నాడు. వాటి ఫలితాలు వెల్లడికాకముందే నిబంధనలకు విరుద్ధంగా అతను పబ్లిక్ బస్‌, ట్యాక్సీలో ప్రయాణం చేశాడు. అంతేకాదు సింగపూర్ ప్రభుత్వం నిబంధనలు అతిక్రమించి.. స్వదేశానికి రావడానికి ప్రయత్నించాడు. ఈ క్రమంలో కొవిడ్ నిబంధనలను పదేపదే ఉల్లంఘించడానే కారణంతో పార్థిబన్ బాలచంద్రన్‌పై సింగపూర్ పోలీసులు కేసు నమోదు చేసి, ఛార్జి షీట్ ఫైల్ చేశారు.