మహేష్ కొత్త సినిమా కి కరోనా ఎఫెక్ట్..!!

వాస్తవం సినిమా: వరుస విజయాలతో మంచి జోరుమీద ఉన్నాడు సూపర్ స్టార్ మహేష్ బాబు. భరత్ అనే నేను, మహర్షి అదే విధంగా “సరిలేరు నీకెవ్వరు” సినిమాలతో బ్లాక్ బస్టర్ విజయాలు సాధించి.. బాక్సాఫీస్ దగ్గర హ్యాట్రిక్ నమోదు చేసుకున్నాడు. పండుగకు వచ్చిన “సరిలేరు నీకెవ్వరు” సినిమా సూపర్ డూపర్ హిట్ అవ్వడంతో పాటు మహేష్ కెరియర్ లో రికార్డు స్థాయిలో ఓపెనింగ్ కలెక్షన్లు వసూలు చేయటం జరిగింది.

పరశురాం దర్శకత్వంలో “సర్కారు వారి పాట” అనే డిఫరెంట్ టైటిల్ ప్రకటించడంతో సినిమాపై ఒక్కసారిగా అభిమానుల్లో ఆసక్తి పెరిగింది. అంతమాత్రమే కాకుండా సినిమాకి సంబంధించి ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా చాలా డిఫరెంట్ గా మహేష్ తన మేకోవర్ మార్చుకోవడంతో…సినిమా స్టోరీ ఏంటి అనే దానిపై ఆసక్తి సామాన్య ప్రేక్షకులలో కూడా నెలకొంది.

ఇదిలా ఉండగా ఈ సినిమాకి సంబంధించి మొదటి షెడ్యూల్ డిసెంబర్ నెలలో అమెరికాలో జరగాల్సి ఉండగా తాజాగా వాయిదా పడినట్లు తెలుస్తోంది. అన్ని ఏర్పాట్లు అంతా పూర్తి అయిన తర్వాత ఇప్పుడు అమెరికాలో కరోనా సెకండ్ వేవ్ రావటంతో అక్కడ పాజిటివ్ కేసులు డబల్ త్రిబుల్ గా నమోదు కావడంతో… సర్కారు వారి పాట మొదటి షెడ్యూల్ ఆలోచనలో సినిమా యూనిట్ ఉన్నట్లు తెలుస్తోంది. సినిమా యూనిట్ కి సంబంధించి వీసా ఏర్పాట్లు అన్నీ పూర్తయిన క్రమంలో…అక్కడ పరిస్థితి చాలా దారుణంగా ఉన్నట్లు వార్తలు రావడంతో షూటింగ్ వాయిదా వేయడమే మంచిదనే అభిప్రాయం లో సినిమా యూనిట్ ఉన్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో స్వదేశంలో సరికొత్త షెడ్యూల్ స్టార్ట్ చేసే ఆలోచనలో సినిమా యూనిట్ ఉన్నట్లు తెలుస్తోంది.