శ్రీనువైట్ల కి ఛాన్స్ ఇచ్చిన మంచు విష్ణు..!!

వాస్తవం సినిమా: ఒకానొక సమయంలో టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ డైరెక్టర్ గా ఓ వెలుగు వెలిగాడు శ్రీనువైట్ల. కామెడీ ఎంటర్టైనర్ తరహాలో శ్రీనువైట్ల చేసిన సినిమాలు టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర రికార్డుల మీద రికార్డులు సృష్టించాయి. ముఖ్యంగా మహేష్ బాబు నటించిన దూకుడు సినిమా రికార్డు స్థాయి కలెక్షన్లు కొల్లగొట్టింది.

అంతేకాకుండా శ్రీనువైట్ల తన సినిమాల్లో ఎక్కువగా బ్రహ్మానందంకి ప్రాధాన్యత ఇస్తూ ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించే వాళ్ళు. అటువంటి శ్రీనువైట్ల కి గత కొన్ని రోజుల నుండి చేస్తున్న సినిమాలు వరుసగా ఫ్లాప్ అవడంతో.. ఆయనతో సినిమా అంటేనే స్టార్ హీరోలు వెనకకు వెళ్లి పోయే పరిస్థితి ఏర్పడినట్లు, మొన్నటి దాక ఇండస్ట్రీలో వార్తలు వచ్చాయి.

ఇటువంటి తరుణంలో శ్రీనువైట్లకు మంచు విష్ణు అవకాశం ఇచ్చినట్లు లేటెస్ట్ వార్త ఇండస్ట్రీలో వైరల్ అవుతుంది. గతంలో శ్రీను వైట్ల దర్శకత్వంలో మంచు విష్ణు “ఢీ” అనే సినిమాని చేసి అదిరిపోయే విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు.

ఈ క్రమంలో మరో సారి వీరిద్దరి కలయికలో సినిమా రాబోతున్నట్లు వార్త ఇండస్ట్రీలో రావడంతో పాటు సోషల్ మీడియాలో కూడా రావడంతో ఇది సంచలనంగా మారింది. ఈ సినిమాతో అయినా విజయం సాధించి శ్రీనువైట్ల హిట్ ట్రాక్ లో పడాలని చాలా మంది కోరుకుంటున్నారు.