గెస్ట్ రోల్ కి భారీ స్థాయిలో రెమ్యూనరేషన్ డిమాండ్ చేసిన బాలయ్య బాబు..??

వాస్తవం సినిమా: ఇండస్ట్రీలో కొత్త నటీనటులను ఎంకరేజ్ చేసే విషయంలో బాలకృష్ణ ఎప్పుడూ ముందు ఉంటారని చాలామంది చెబుతారు. ఇటీవల కొత్త నటీనటుల సినిమాకి సంబంధించి ఒక కార్యక్రమంలో కూడా బాలయ్య బాబు అతిథిగా వచ్చి వారిని సపోర్ట్ చేయడం జరిగింది.

ఇటువంటి తరుణంలో ఇండస్ట్రీలో కుర్ర హీరోలలో తనకంటూ సపరేటు గుర్తింపు తెచ్చుకున్న నాగశౌర్య ప్రస్తుతం రెండు సినిమాలు లైన్ లో పెట్టడం జరిగింది. ఒకటి శ్రీదేవి మూవీస్ బ్యానర్ లో శివలెంక కృష్ణ ప్రసాద్ అనే నిర్మాత నిర్మిస్తున్న సినిమా ఒకటైతే మరొకటి కథా చర్చలు జరుగుతున్నాయి.

ఇలా ఉండగా శివలెంక కృష్ణ ప్రసాద్ నిర్మాణంలో నాగశౌర్య నటించిన సినిమా లో అతిధి పాత్రలో బాలకృష్ణ నటింపజేయడానికి సినిమా యూనిట్ ప్రయత్నాలు చేస్తున్నట్లు ఇండస్ట్రీలో వార్తలు వచ్చాయి. పూర్తి విషయంలోకి వెళితే శివలెంక కృష్ణ ప్రసాద్ నిర్మాణంలో గతంలో బాలయ్య బాబు హీరోగా ఆదిత్య 369- వంశానికొక్కడు- భలేవాడివి బాసూ వంటి చిత్రాలు నిర్మించారు. ఆ చనువుతో బాలయ్యని కీలక పాత్ర కోసం అడిగారని ప్రచారం జరిగింది.

ఈ క్రమంలో గెస్ట్ రోల్ పాత్రకి బాలకృష్ణ భారీ స్థాయిలో రెమ్యూనరేషన్ డిమాండ్ చేసినట్లు దీంతో నిర్మాత వెనక్కి తగ్గినట్లు సరికొత్త వార్త ఇండస్ట్రీలో వినబడుతోంది. ప్రస్తుతం బాలయ్య బాబు బోయపాటి దర్శకత్వంలో సినిమా చేస్తున్నారు.