బాలీవుడ్ ఎంట్రీ విషయంలో అల్లు అర్జున్ సరికొత్త ప్రయోగం..!!

వాస్తవం సినిమా: సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో అల్లు అర్జున్ కి ఉన్న మార్కెట్ టాలీవుడ్ ఇండస్ట్రీలో మరో హీరో కి లేదు అని చెప్పవచ్చు. తెలుగు మరియు తమిళ మరియు మలయాళంలో అల్లు అర్జున్ సినిమాలకు మంచి ఆదరణ లభిస్తుంది. పరిస్థితి ఇలా ఉండగా టాలీవుడ్ ఇండస్ట్రీలో చాలా మంది స్టార్ హీరోలు బాలీవుడ్ ఇండస్ట్రీలోకి తమ సినిమాలను దింపుతూ అక్కడక్కడా తమకంటూ మార్కెట్ క్రియేట్ చేసుకుంటున్నారు. ఈ క్రమంలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కూడా బాలీవుడ్ ఎంట్రీ విషయంలో సరికొత్త ప్రయోగం చేయడానికి రెడీ అయినట్లు ఫిలింనగర్ లో వార్తలు వస్తున్నాయి. పూర్తి మేటర్ లోకి వెళ్తే డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ “పుష్ప” సినిమాతో బాలీవుడ్ ఇండస్ట్రీలో కి అడుగు పెట్టనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇందుకోసం ఉత్తరాదిలో పుష్ప సినిమాకి సంబంధించి ప్రచార కార్యక్రమాల కోసం ప్రత్యేకమైన టీమ్ ని అల్లు అర్జున్ ఏర్పాటు చేసినట్లు టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే బన్నీ నటించిన సినిమాల డబ్బింగ్ లకి మంచి ఆదరణ లభించడంతో, అల్లుఅర్జున్ పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న “పుష్ప” సినిమాతో బాలీవుడ్ డైరెక్ట్ ఎంట్రీ ఇచ్చే ఆలోచనలో సరికొత్త వ్యూహాలతో అడుగులు వేస్తున్నట్లు సమాచారం.