ప్రధానికి, రాష్ట్రపతికి లేఖ రాసిన సీఎం కేసీఆర్

వాస్తవం ప్రతినిధి: ప్రధాని నరేంద్రమోడీకి తెలంగాణ సీఎం కేసీఆర్ లేఖ రాసారు. కేంద్ర ప్రభుత్వ రంగ రైల్వే పరీక్షలను రెండు భాషల్లోనే నిర్వహిస్తున్నారని.. ఇతర ప్రాంతీయ భాషల్లో కూడా నిర్వహించేందుకు అనుమతించాలని లేఖలో సీఎం కేసీఆర్ విజ్ఞప్తి చేశారు. దీనివల్ల గ్రామీణ ప్రాంత విద్యార్థులకు మేలు జరుగుతుందని పేర్కొన్నారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని సమస్యను పరిష్కరించాలని కోరారు.

ఇక రాష్ట్రపతికి సైతం తెలంగాణ సీఎం కేసీఆర్ లేఖ రాశారు. దేశ మాజీ ప్రధానమంత్రి తెలంగాణ ముద్దుబిడ్డ పీవీ నరసింహారావు స్మారక తపాలా స్టాంప్కు అనుమతి ఇవ్వాలని కేసీఆర్ విజ్ఞప్తి చేశారు. స్టాంప్ ను హైదరాబాద్ లో విడుదల చేయాలని లేఖలో పేర్కొన్నారు.