ఏపీ లో లాగానే తెలంగాణలో కూడా కలసి పని చేస్తాం అంటున్న పవన్ కళ్యాణ్..!!

వాస్తవం ప్రతినిధి: గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది కమలం పార్టీ. దుబ్బాక ఉప ఎన్నికల్లో గెలవడంతో జిహెచ్ఎంసి ఎన్నికలలో కూడా సత్తా చాటి టిఆర్ఎస్ పార్టీకి చెక్ పెట్టడానికి తెలంగాణ బీజేపీ నేతలు అనేక వ్యూహాలు వేస్తున్నారు. దీనిలో భాగంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో కలసి తెలంగాణలో కూడా పని చేయాలని భావించినా, తెలంగాణ బీజేపీ నేతలు కిషన్ రెడ్డి, లక్ష్మణ్ తాజాగా జనసేన పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ తో భేటీ అయ్యారు. గ్రేటర్ ఎన్నికల ప్రచారానికి పవన్ కల్యాణ్ ని ఆహ్వానించారు. దాదాపు గంట సేపు సమావేశం పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో జరగగా కీలక నిర్ణయాలు తీసుకున్నారు.

ఈ నేపథ్యంలో ఏపీలో బీజేపీతో కలిసి పనిచేసిన సమయంలో తెలంగాణ బీజేపీ లో కూడా కలిసి పనిచేయాలని ఆలోచన చేస్తున్న సమయంలోనే కరోనా రావటంతో.. తెలంగాణ బీజేపీ తో జనసేన మిత్ర పక్షం అనేది క్లారిటీ లేకుండా పోయింది. కానీ తాజా పరిస్థితులు బట్టి తెలంగాణలో బలమైన నాయకత్వం అవసరమని బి.జె.పి.తో కలిసి పని చేయడానికి ముందుకు వస్తున్నట్లు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. హైదరాబాద్ అనేది విశ్వనగరం అని, ఒక ప్రాంతానికో లేకపోతే ఒక మతానికో చెందినది కాదని, అటువంటి విశ్వ నగరానికి మోడీ నాయకత్వం చాలా అవసరం అంటూ జీహెచ్ఎంసీ ఎన్నిక లో మాత్రమే కాక భవిష్యత్తులో కూడా బిజెపికి సపోర్ట్ చేస్తున్నట్లు, కలసి పని చేస్తున్నట్లు పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు.