కొవిడ్-19 సెకండ్ వేవ్ .. యూఏఈ కీలక నిర్ణయం ..!!

వాస్తవం ప్రతినిధి: కొవిడ్-19 సెకండ్ వేవ్ కారణంగా యూఏఈ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్టు అధికారులు వెల్లడించారు. 12 దేశాలకు విజిట్ వీసాలను తాత్కాలికంగా నిలిపివేసారు. యూఏఈ నిషేధం విధించిన దేశాల్లో.. పాకిస్థాన్, టర్కీ, ఇరాన్, యమెన్, సిరియా, ఇరాక్, సొమాలియా, లిబియా, కెన్యా, ఆప్ఘనిస్తాన్ తదితర దేశాలున్నాయి. యూఏఈ ఆంక్షలు విధించిన 12 దేశాల్లోనూ కరోనా కేసులు భారీగా నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే యూఏఈ ప్రభుత్వం కరోనా నియంత్రణలో భాగంగా విజిట్ వీసాలను తాత్కాలికంగా నిలిపివేసినట్టు అధికారులు వెల్లడించారు.