ప్రభాస్ కొత్త సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్ ..!!

వాస్తవం సినిమా : ప్రభాస్ హీరోగా బాలీవుడ్ డైరెక్టర్ ఓం రావత్‌ దర్శకత్వంలో ‘ఆదిపురుష్‌’ అనే సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. భారీ బడ్జెట్ కలిగిన ఈ సినిమాలో ప్రభాస్ రాముడి పాత్రలో కనిపించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. అంతే కాకుండా బాలీవుడ్ స్టార్ నటుడు సైఫ్‌ అలీఖాన్‌ లంకేశ్ గా కనిపించనున్నాడు. చాలా ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో సీత పాత్ర కోసం చాలామంది హీరోయిన్ల పేర్లు వినపడుతున్నాయి. ఇంకా ఎవరు కన్ఫామ్ కాలేదు. ఇటువంటి తరుణంలో ఈ సినిమాకి సంబంధించి రిలీజ్ డేట్ సినిమా యూనిట్ అధికారికంగా చెప్పటంతో అభిమానులలో సంతోషం నెలకొంది. పూర్తి విషయంలోకి వెళితే ఈ సినిమాను 2022 ఆగస్టు 11 న ప్రేక్షకుల ముందుకు తీసుకు రానున్నారు. ఈమేరకు పోస్టర్ ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్. ఈ సినిమా అప్డేట్స్ కోసం డార్లింగ్ ఫ్యాన్స్ ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. అభిమానులు ఈ వార్త తెలుసుకుని ఫుల్ హ్యాపీగా ఉన్నారు. అంతేకాకుండా ఈ సినిమాలో ప్రభాస్ ఎలా ఉండబోతున్నాడా అన్న ఆసక్తి మరింత పెరిగింది.