కరోనా టెన్షన్ తో క్వారంటైన్‌ కు సల్మాన్ ఖాన్..!!

వాస్తవం సినిమా : దేశంలో కరోనా వైరస్ ఎవరిని విడిచి పెట్టడం లేదు. రోజు రోజుకి మహమ్మారి ప్రభావం ఎక్కువైపోతుంది. పైగా చలికాలం కావడంతో వైరస్ మరింతగా బలపడి మనుషుల పై బాగా ప్రభావం చూపుతుంది. సెకండ్ వేవ్ దెబ్బకీ యూరప్, అమెరికా దేశాలు వణికిపోతున్నాయి. పరిస్థితి ఇలా ఉండగా తాజాగా బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ క్వారంటైన్‌ కు వెళ్లారు. పూర్తి మేటర్ లోకి వెళ్తే

CAఇటీవల తన వ్యక్తిగత సిబ్బంది తో పాటు కారు డ్రైవర్ కి కరోనా సోకడంతో క్వారంటైన్‌ కు వెళ్లిపోయారు. మరో పక్క తన సిబ్బందికి మంచి వైద్యం అందించే ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఈ విషయాన్ని సోషల్ మీడియాలో సల్మాన్ ఖాన్ వెల్లడించారు. వ్యక్తిగత సిబ్బంది కి కరోనా రావటంతో ముందు జాగ్రత్త చర్యగా తాను హెం క్వారంటైన్‌లో ఉన్నట్లు సల్మాన్‌ పేర్కొన్నారు. అదేవిధంగా ఈ మహమ్మారి విషయంలో ప్రజలంతా అవగాహన కలిగి ఉండాలని అభిమానులు జాగ్రత్తగా ఉండాలి అంటూ సూచించారు. ప్రభుత్వం కరోనా విషయంలో విధించిన నిబంధనలను ప్రజలంతా పాటించాలని మాస్క్‌లు ధరించాలని చెప్పారు.