సూర్య కొత్త సినిమా పై పొగడ్తలు వర్షం కురిపించిన మహేష్..!!

వాస్తవం సినిమా : సూర్య నటించిన కొత్త సినిమా “ఆకాశం నీ హద్దు రా” ఓటీటీలో రిలీజ్ అయ్యి సూపర్ డూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. ఇప్పటివరకూ ఓటీటీలో రిలీజ్ అయిన సినిమాకు రాని రెస్పాన్స్ ఈ సినిమాకి వచ్చింది. చాలా మంది ప్రముఖులు మరియు స్టార్ హీరోలు “ఆకాశం నీ హద్దురా” సినిమా చూసి సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఇదే సినిమా థియేటర్ లో పడి ఉంటే వేరే రకంగా ఉండేదని, సూర్య కి తగ్గ సినిమా డైరెక్టర్ సుధ కొంగర తీశాడని థియేటర్ లో అయితే కచ్చితంగా 100 కోట్లు వసూలు చేసేది అంటూ విశ్లేషిస్తున్నారు.

ఇదిలా ఉండగా తాజాగా సూపర్ స్టార్ మహేష్ బాబు “ఆకాశం నీ హద్దురా” సినిమాను చూసి ట్విట్టర్లో స్పందించారు. సినిమా బాగుంది అంటూ సినిమా యూనిట్ కి అభినందనలు తెలిపారు. ముఖ్యంగా సూర్య నటనను ప్రసంసించారు. దానికి సూర్య కూడా థాంక్స్ చెప్పారు. ‘టన్నుల కొద్ది ధన్యవాదాలు బ్రదర్ .. సర్కారు వారి పాట సినిమా చూడటానికి ఆసక్తిగా ఎదురుచూస్తున్నా’ అంటూ సూర్య రాసుకొచ్చారు. ఇలా ఇద్దరు స్టార్ హీరోలు సోదరభావం కనబరచడంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మరోపక్క చిన్ననాటి నుండి వీళ్లిద్దరు స్నేహితులు కావటం విశేషం.