జమ్ముకశ్మీర్‌లో ఎదురుకాల్పులు..నలుగురు ముష్కరులు హతం

వాస్తవం ప్రతినిధి: జమ్ముకశ్మీర్‌లో భద్రతాదళాలు, టెర్రరిస్టులకు మధ్య ఎదురుకాల్పుల్లో నలుగురు ముష్కరులు హతమయ్యారు.పదే పదే కాల్పుల విరమణ ఒప్పందానికి పాక్‌ తూట్లు పొడుస్తూనే ఉంది. ఉగ్రవాదుల కదలికలపై భద్రతాదళాలకు ఇంటెలిజెన్స్ సమాచారం అందడంతో..జమ్ము నగర సమీపంలో బాన్ టోల్‌ప్లాజా వద్ద వచ్చి పోయే వాహనాలలో తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమంలో భద్రతాదళాలపై పాక్‌ ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. దీంతో అప్రమత్తమైన భద్రతాబలగాలు.. పాక్‌ కాల్పులను సమర్థవంతంగా తిప్పికొడుతున్నారు. ఎదురుకాల్పుల్లో నలుగురు ఉగ్రవాదులు హతమైనట్టు తెలుస్తోంది. భద్రతాదళాలు, ఉగ్రవాదుల మధ్య ఇంకా కాల్పులు కొనసాగుతూనే ఉన్నాయి. మరోవైపు.. జమ్మూ-శ్రీనగర్ జాతీయ రహదారిని మూసివేసి.. జమ్మూకశ్మీర్‌లోని చెక్‌పోస్టుల దగ్గర భద్రత కట్టుదిట్టం చేశారు.