అభివృద్ధి లేదు..అంతా అప్పులే: దేవినేని ఉమా

వాస్తవం ప్రతినిధి: టిడిపి పార్టీ కీలక నేత మాజీ మంత్రి దేవినేని ఉమా వైసీపీ ప్రభుత్వం పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. సీఎం జగన్ పరిపాలన విధానం పై ప్రశ్నల వర్షం కురిపించారు. వైసీపీ ప్రభుత్వం అప్పులు చేయడం తప్ప రాష్ట్రాన్ని అభివృద్ధి చేయటం లేదు అన్నట్టు వ్యాఖ్యలు చేశారు.

ఎక్కడ చూసినా బెదిరింపు కక్షసాధింపు చర్యలకు పాల్పడుతూ ప్రత్యర్థులను కట్టడి చేస్తున్నారని దేవినేని ఉమ ఆరోపించారు. అమరావతి ని ముంచేశారు పోలవరాన్ని కూడా చంపేస్తున్నారు, 23 మంది ఎంపీలను ఇస్తే కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా తెస్తామని మాట ఇచ్చి ఇప్పుడు గాలికొదిలేశారని మండిపడ్డారు.

ఎంపీలు ఎవరూ రాష్ట్ర ప్రయోజనాల కోసం పార్లమెంటులో మాట్లాడకపోవడం దారుణమని ప్రజలను వంచించడం అంటూ సీఎం జగన్మోహన్ రెడ్డికి ప్రశ్నలు వేశారు. విశాఖపట్టణం లో ఎలాంటి అనుమతులు లేకుండా గెస్ట్హౌస్ పనులు జరుగుతున్నాయని ఆరోపించారు. స్టేటస్ కో అమలు లో ఉన్నా, భారీ యంత్రాలతో తొట్ల కొండ పై 30 ఎకరాల స్థలాన్ని చదును చేస్తున్న ప్రభుత్వం అంటూ విమర్శించారు. అందుకు సంబంధించిన పలు పనులు జరగడం పట్ల ఉమా ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజదాని తరలింపు పై స్టేటస్ కో అమలు లో ఉండగా, గెస్ట్ హౌస్ నిర్మాణం ఏ విధంగా చేస్తారు అంటూ సూటిగా ప్రశ్నించారు.