చిరంజీవి ని డైరెక్ట్ చేయబోతున్న హరీష్ శంకర్..?? 

వాస్తవం సినిమా:  మెగా కాంపౌండ్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్, సాయి ధరమ్ తేజ్ తో సినిమాలు చేశారు డైరెక్టర్ హరీష్ శంకర్. వీరిలో పవన్ కళ్యాణ్ తో చేసిన గబ్బర్ సింగ్ సినిమా టాలీవుడ్ బాక్సాఫీస్ ని షేక్ చేసి పడేసింది. దాదాపు పది సంవత్సరాల పాటు సరైన హిట్ లేని పవన్ కళ్యాణ్ కి “గబ్బర్ సింగ్” రూపంలో బ్లాక్ బస్టర్ ఇచ్చాడు హరీష్. ఈ సినిమా అప్పట్లో సృష్టించిన రికార్డులు అన్నీ ఇన్నీ కావు.

ఇదిలా ఉండగా మరో సారి ప్రస్తుతం పవన్ కళ్యాణ్ తో రెండో సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే హరీష్ శంకర్ మెగా కాంపౌండ్ నుండి మరో సంచలన అవకాశాన్ని అందుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. మేటర్ లోకి వెళితే మెగాస్టార్ చిరంజీవిని డైరెక్ట్ చేసే అవకాశం హరీష్ అందుకున్నట్లు, ఇప్పటికే స్క్రిప్ట్ కూడా రెడీ చేసుకున్నట్లు త్వరలోనే ఆయనకు వినిపించి ఓకే చేయించుకోవటానికి సిద్ధమవుతున్నట్లు ఫిలింనగర్లో వార్తలు వైరల్ అవుతున్నాయి.

ప్రస్తుతం చిరంజీవి.. కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య సినిమా చేస్తున్నారు. ఈ సినిమా అయిన వెంటనే లూసిఫర్ రీమేక్ ని వివి వినాయక్ దర్శకత్వంలో చేయబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే లూసిఫర్ రీమేక్ కంటే ముందే హరీష్ శంకర్ సినిమా చిరంజీవి చేయనున్నట్లు ఫిలిం నగర్ టాక్. ఈ ప్రాజెక్టుకు సంబంధించి త్వరలో అధికారికంగా వార్త రానుందని ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి.