వెబ్‌సిరీస్‌లో సానియా

వాస్తవం ప్రతినిధి: భారత టెన్నిస్‌ స్టార్‌ సానియా మీర్జా వెబ్‌సిరీస్‌లో నటించనుంది. టీబీపై ప్రజలకు అవగాహన కల్పించే లక్ష్యంతో ఈ సిరీస్‌ను చిత్రీకరించనున్నారు. మొత్తం ఐదు ఎపిసోడ్స్‌ ఉండే ఈ వెబ్‌సిరీస్‌ త్వరలోనే ఎంటీవీలో ప్రసారం కానుంది. నిషేధ్‌ ఎలోనే టుగెదర్‌ పేరుతో వెబ్‌సిరీస్‌ తెరకెక్కనుంది. ఈ సందర్భంగా సానియా మీర్జా మాట్లాడుతూ మన దేశంలో ఎంతోమంది టీబీ కారణంగా అస్వస్థతకు గురవుతున్నారనీ, టీబీ బారినపడు తున్నవారిలో ప్రధానంగా యువత ఎక్కవ పేర్కొన్నారు. ప్రస్తుతం కరోనా విపత్కర పరిస్థితుల్లో టీబీ తీవ్రంగా ప్రభావం చూపుతోంది. దీనిపై ప్రజలకు అవగాహన కల్పించి వారిలో చైతన్యం తీసుకురావాల్సిన అవసరం ఉందనీ, అందుకే ప్రజలకు వాస్తవాలను తెలిపేందుకు ఈ వెబ్‌సిరీస్‌లో నటించేందుకు అంగీకరించాను అని సానియా తెలిపింది.