ఎన్టీఆర్- త్రివిక్రమ్ సినిమాలో సీనియర్ హీరోయిన్..??

వాస్తవం సినిమా: మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో వస్తున్న సినిమాలలో చాలా మంది అప్పట్లో ఉన్న సీనియర్ హీరోయిన్లను తీసుకుంటున్న సంగతి తెలిసిందే. “అజ్ఞాతవాసి” సినిమా లో కుష్బూ ని, “అల వైకుంఠపురం లో” టబు ని తీసుకున్న త్రివిక్రమ్ నెక్స్ట్ ఎన్టీఆర్ తో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ కెరీర్లో ఈ సినిమా 30 వ సినిమా కావటంతో చాలా ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు.

అయితే ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో నటింపజేయడానికి సీనియర్ హీరోయిన్ రమ్యకృష్ణ ని తీసుకోవడానికి సినిమా యూనిట్ రెడీ అయినట్లు సరికొత్త వార్త ఇండస్ట్రీలో వినబడుతోంది. బాహుబలి సినిమాలో శివగామి గా రమ్యకృష్ణ నటించి సెకండ్ ఇన్నింగ్స్ లో మంచి క్రేజ్ ని సంపాదించింది. ఇటువంటి తరుణంలో ఎన్టీఆర్ సినిమాలో ఓ కీలక పాత్రకు సంబంధించి రమ్యకృష్ణ అయితేనే కరెక్ట్ అని త్రివిక్రమ్ భావిస్తున్నట్లు ఆమెతో మంతనాలు జరిపి త్వరలోనే అధికారికంగా ప్రకటించిన దాని కి రెడీ అవుతున్నట్లు ఫిలింనగర్ లో వార్తలు వస్తున్నాయి.

గతంలో రమ్యకృష్ణ ఎన్టీఆర్ తో “నా అల్లుడు” సినిమా చేయడం జరిగింది. అంతేకాకుండా “సింహాద్రి” సినిమాలో ఓ మాస్ సాంగ్ లో కూడా ఎన్టీఆర్ తో కలిసి స్టెప్పులు వేసింది. అయితే చాలా కాలం తర్వాత మళ్లీ ఎన్టీఆర్ తో రమ్య కృష్ణ సినిమా చేయబోతున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు రావడంతో నందమూరి అభిమానులు ఫుల్ హ్యాపీగా ఉన్నారు.