ఎవరితోనూ పొత్తు లుండవు తేల్చేసిన బండి సంజయ్..!!

వాస్తవం ప్రతినిధి: గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల గురించి ప్రముఖ టీవీ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. కచ్చితంగా గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో బీజేపీ గెలవడం గ్యారెంటీ అని పేర్కొన్నారు. బిజెపికి ప్రధాన ప్రత్యర్థి ఎంఐఎం పార్టీ అని టీఆర్ఎస్ పార్టీకి అసలు గ్రేటర్ పరిధిలో క్యాడర్ లేదని స్పష్టం చేశారు. సర్వే ఫలితాల ప్రకారం దాదాపు వంద సీట్లకు పైగానే బీజేపీ గెలుస్తుంది అని మేయర్ పీఠం పై కాషాయం జెండా ఎగరేస్తాం అంటూ బండి సంజయ్ స్పష్టం చేశారు.

ఇక పొత్తుల గురించి మాట్లాడుతూ ఇప్పటివరకు బీజేపీతో పొత్తు పెట్టుకోవడానికి ఏ పార్టీ ముందుకు రాలేదని, కాబట్టి గ్రేటర్ పరిధిలో జరిగే ఎన్నికలకు ఎవరితోనూ పొత్తులు ఉండవు అంటూ క్లారిటీ ఇచ్చారు. వరదలు వచ్చిన సమయంలో నగరంలో ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్న సమయంలో సీఎం కేసీఆర్ ప్రజల బాధలు చూడటానికి రాలేదని, కనీస సాయం కూడా ప్రజలకు చేయలేదని, ఖచ్చితంగా గ్రేటర్ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీకి నగర ప్రజలు బాగా బుద్ధి చెబుతారని బండి సంజయ్ తెలిపారు. ఏది ఏమైనా భాగ్యనగరం పరువు పోయేలా టిఆర్ఎస్ పార్టీ పరిపాలన ఉందని కచ్చితంగా దుబ్బాక ఉప ఎన్నికల్లో సీన్ గ్రేటర్లో రిపీట్ అవుతుందని స్పష్టం చేశారు.