నేడు కరోనా పుట్టినరోజు..!!

వాస్తవం ప్రతినిధి: ప్రపంచాన్ని గజగజ వణికిస్తున్న కరోనా వైరస్‌ మొదటి కేసు వెలుగు చూసి నేటికి ఏడాది పూర్తయింది. అంటే నవంబర్‌ 17, 2020కు మొదటి పుట్టిన రోజు జరుపుకుంటోంది. వాస్తవానికి ఈ వైరస్ ఎప్పుడు వెలుగు చూసిందనే విషయంపై భిన్నాభిప్రాయాలు ఉన్నప్పటికీ హాంకాంగ్ పత్రిక ‘ది సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్’ తెలిపిన దాని ప్రకారం 2019 నవంబర్‌ 17న చైనాలోని హుబీ ప్రావిన్స్‌కు చెందిన 55 ఏళ్ల వ్యక్తికి మొట్ట మొదట కరోనా సోకినట్లు గుర్తించారు.

కాగా ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా 55,389,375మందికి ఈ వైరస్ సోకింది. వీరిలో 38,529,424 మంది కరోనా నుంచి కోలుకోగా.. 1,333,019 మంది మృత్యువాతపడ్డారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 15,526,932 యాక్టివ్ కేసులు ఉన్నాయి. మరోవైపు ఏడాది అవుతున్నా ఈ వైరస్‌కి వ్యాక్సిన్‌పై క్లినికల్‌ ట్రయల్స్‌ కొనసాగుతున్నాయి.