అర్ధరాత్రి చలిలో తెగ కష్టపడుతున్న “ఆర్ఆర్ఆర్” టీం..!!

వాస్తవం సినిమా: బాహుబలి వంటి భారీ బ్లాక్ బస్టర్ తర్వాత రాజమౌళి దర్శకత్వంలో వస్తున్న సినిమా “ఆర్ఆర్ఆర్”. దేశవ్యాప్తంగా ఈ సినిమాపై అంచనాలు ఓ రేంజిలో ఉన్నాయి. ఇదిలా ఉండగా సినిమా ప్రారంభించిన తరుణంలో మీడియా సమావేశం నిర్వహించి ఈ ఏడాది జూన్ మాసంలో రిలీజ్ చేస్తానని మాట ఇచ్చిన రాజమౌళి కొన్ని కారణాల కారణంగా సినిమా షూటింగ్ అప్పట్లోనే వాయిదాలు పడుతూ ఉండటంతో వచ్చే ఏడాది జనవరి అన్నారు. ఈ లోపు కరోనా రావటంతో మొత్తం పరిస్థితులు మారటంతో ఈ సినిమా విడుదల విషయంలో రకరకాల కామెంట్లు వస్తున్నాయి. పరిస్థితి ఇలా ఉండగా వాయిదా పడిన తర్వాత ఇటీవల షూటింగ్ మొదలుపెట్టిన సినిమా యూనిట్ అర్ధరాత్రి చలిలో కూడా సినిమా షూటింగ్ చేస్తూ వస్తున్నారు. తాజాగా అర్ధరాత్రి సినిమా సెట్ లో జరుగుతున్న షూటింగ్ వర్కింగ్ వీడియో ని రిలీజ్ చేశారు. ఈ వీడియోలో సినిమా యూనిట్ సభ్యులంతా చలి కాచుకుంటూ మరోపక్క షూటింగ్ చేస్తూ వస్తున్నారు. సోషల్ మీడియా లో రిలీజ్ అవ్వడం సినిమా విడుదల కోసం “ఆర్ఆర్ఆర్” టీం తెగ కష్టపడుతుంది అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.