సూర్య కొత్త సినిమా పై విజయ్ దేవరకొండ ఆసక్తికర వ్యాఖ్యలు..!!

వాస్తవం సినిమా: ఇటీవల ఓటీటీ లో రిలీజ్ అయిన సూర్య కొత్త మూవీ “ఆకాశమే నీ హద్దురా” సూపర్ డూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. ఈ సినిమాని ఇప్పుడు బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా రీమేక్ చేయటానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమాను చూసిన చాలా మంది ప్రముఖులు సోషల్ మీడియాలో రియాక్ట్ అవుతున్నారు. కరోనా కారణంగా ఈ సినిమా ఓటీటీ లో విడుదలయి భారీ లాభాలు సాధిస్తున్న తరుణంలో సినిమా యూనిట్ కి శుభాకాంక్షలు తెలుపుతున్నారు. తాజాగా విజయ్ దేవరకొండ కూడా సినిమాను చూసి ప్రశంసల వర్షం కురిపించారు. ట్విటర్లో విజయ్ దేవరకొండ ఏమన్నారంటే..నేను సూరారై పోట్రూ సినిమాని నా స్నేహితులతో కలిసి చూసాను .. సినిమా చూస్తున్నంత సేపు కళ్ళకి నీళ్లు వచ్చాయి .సినిమా చాలా బాగుంది .మా స్నేహితులు కూడా సినిమాకి బాగా కనెక్ట్ అయ్యారు అని చెప్పాడు .. హీరో అండ్ హీరోయిన్స్ అద్భుతంగా నటించారు అలాగే మీ దర్శకత్వం కూడా చాలా బాగుందని సుధా కొంగర ఫై ప్రశంసలు కురిపించారు ..సాంకేతిక వర్గం కూడా చాలా బాగా పనిచేశారని అన్నారు .ఇక చివర్లో అందరు కలిసి చూడదగ్గ సినిమా అని ట్వీట్ చేసారు.