తిరుమలకు విచ్చేస్తున్న భారత రాష్ట్రపతి..ఆహ్వానించనున్న సీఎం జగన్

వాస్తవం ప్రతినిధి: భారత రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఈ నెల 24న తిరుమలకు విచ్చేస్తున్నారు. శ్రీవేంకటేశ్వరస్వామివారి దర్శనార్థం సతీసమేతంగా ఆయన తిరుమలకు రానున్నారు. దర్శనానంతరం అదే రోజున ఆయన ఢిల్లీకి తిరిగి వెళ్లిపోనున్నారు. మరోవైపు రాష్ట్రపతి రానున్న నేపథ్యంలో ఆయన పర్యటనకు టీటీడీ అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. రాష్ట్రపతి పర్యటన నేపథ్యంలో ముఖ్యమంత్రి జగన్ తిరుమలకు రానున్నారు. తిరుపతి రేణిగుంట విమానాశ్రయంలో రాష్ట్రపతికి ముఖ్యమంత్రి జగన్, టీటీడీ అధికారులు స్వాగతం పలకనున్నారు. అనంతరం వీరందరూ రోడ్డు మార్గంలో తిరుమల చేరుకుంటారు.