వైసీపీపై మాజీ ఎంపీ హర్షకుమార్ షాకింగ్ కామెంట్లు..!!

వాస్తవం ప్రతినిధి: మాజీ ఎంపీ హర్షకుమార్ వైసీపీ ప్రభుత్వం పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో దళితులపై దాడులు ఎక్కువయ్యాయని, శిరోముండనం పుట్టింది అంటూ మండిపడ్డారు. రామచంద్రపురం నియోజకవర్గం లో జరిగిన దళితులపై శిరోముండనం దాడులలో దోషులెవరు అనే విషయం పై సీఎం జగన్ కి క్లారిటీ ఉందని చెప్పుకొచ్చారు. అలాంటి వ్యక్తికి దళితులపై దాడి చేసిన వ్యక్తి జగన్ తెలిసి కూడా రెండు పదవులు కట్టబెట్టారు అంటూ హర్ష కుమార్ ఆరోపణలు చేశారు. రామచంద్రపురం నియోజకవర్గం పరిధిలో ఉండే వైసీపీ ఎమ్మెల్యే ఎస్సీలకు చెందాల్సిన ప్రభుత్వ ఫలాలను తన సొంత సామాజిక వర్గాలకు చెందిన వారికి కేటాయిస్తున్నారని ఆరోపించారు. పోలీసులు అదే విధంగా అధికారులు కూడా అధికార పార్టీ ఎమ్మెల్యేల మాటను పాటిస్తూ సెటిల్మెంట్లు చేస్తున్నారని ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని హర్ష కుమార్ ఆరోపించారు. ఏదిఏమైనా వైసీపీ అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో దళితులపై దాడులు ఎక్కువయ్యాయని, దాడులు చేస్తున్న వారిని ముఖ్యమంత్రి ప్రోత్సహిస్తున్నట్లుగా హర్ష కుమార్ వ్యాఖ్యానించారు.