కరోనా వ్యాక్సిన్ అభివృద్ధి చేస్తున్న కంపెనీల‌పై హ్యాక‌ర్లు దాడి..!

వాస్తవం ప్రతినిధి: కోవిడ్‌19 టీకా అభివృద్ధి చేస్తున్న ఫార్మా కంపెనీల‌పై ర‌ష్యా, నార్త్ కొరియా హ్యాక‌ర్లు దాడి చేస్తున్న‌ట్లు మైక్రోసాఫ్ట్ పేర్కొన్న‌ది. కెన‌డా, ఫ్రాన్స్‌, ఇండియా, ద‌క్షిణ కొరియా, అమెరికా దేశాల్లో ఏడు ప్ర‌ఖ్యాత ఫార్మా సంస్థ‌లు వ్యాక్సిన్ అభివృద్ధి చేస్తున్నాయ‌ని, అయితే ఆ కంపెనీల‌పై సైబ‌ర్ హ్యాక‌ర్లు దాడి చేస్తున్న‌ట్లు మైక్రోసాఫ్ట్ ఆరోపించింది. అయితే టార్గెట్ చేసిన సంస్థ‌ల‌కు ఈ విష‌యాన్ని చేర‌వేసిన‌ట్లు మైక్రోసాఫ్ట్ వెల్ల‌డించింది. మూడు హ్యాక‌ర్ గ్రూపులు ఈ దాడుల‌కు పాల్ప‌డుతున్నాయ‌ని, వాటిలో ర‌ష్యాకు చెందిన స్ట్రోన్‌టియ‌మ్‌, నార్త్ కొరియాకు చెందిన జింక్‌, సీరియ‌మ్ హ్యాక‌ర్లు సైబ‌ర్ దాడుల‌కు పాల్ప‌డుతున్న‌ట్లు మైక్రోసాఫ్ట్ ఆరోపించింది.