ఒక్కరోజే 6లక్షలకు పైగా కేసులు.. ఇదే మొదటిసారి : WHO

వాస్తవం ప్రతినిధి: ప్రపంచవ్యాప్తంగా కరోనా విలయతాండవం కొనసాగుతోంది. ఒక్కరోజే 6లక్షలకు పైగా కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో ప్రపంచవ్యాప్తంగా 6,57,312 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 5,31,64,803కు చేరింది. ఇక 24 గంటల్లో 9,797 మంది కరోనాతో మృత్యువాతపడగా.. మృతుల సంఖ్య 1,300,576కు చేరింది. కరోనా మహమ్మారి వచ్చిన నాటి నుంచి ఒకే రోజు ఇన్ని కేసులు నమోదుకావడం ఇదే మొదటిసారి అని డబ్ల్యూహెచ్ఓ పేర్కొంది. కొత్తగా నమోదైన కేసుల్లో అత్యధిక కేసులు యూరప్ దేశాల నుంచే నమోదైనట్టు తెలిపింది. గడచిన 24 గంటల్లో యూరప్ వ్యాప్తంగా 2.85 లక్షలకు పైగా కేసులు నమోదైనట్టు చెప్పింది.