దీపావళికి మహేష్ బాబు శుభాకాంక్షలు..!!

వాస్తవం సినిమా: దీపావళి పండుగ సందర్భంగా పలువురు సినీ, రాజకీయ సెలబ్రిటీలు సోషల్ మీడియాలో తమ అభిమానులకు ఫాలోవర్స్ కి శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఎవరికి వారు దీపావళి సందర్భంగా జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. టాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా పలువురు స్టార్ హీరోలు సోషల్ మీడియా సాక్షిగా దీపావళి శుభాకాంక్షలు విన్నవించుకున్నారు. ఈ క్రమంలో మహేష్ బాబు కూడా శుభాకాంక్షలు తెలిపారు… మీ అందరికీ దీపావళి శుభాకాంక్షలు! మనం ప్రేమ, ఆశ మరియు ఆనందం యొక్క కాంతిని వ్యాప్తి చేసేటప్పుడు మనం పర్యావరణాన్ని కాలుష్యం నుండి సురక్షితంగా ఉంచాలని గుర్తుంచుకుందాం. అది ఎల్లప్పుడూ ప్రకాశవంతంగా ప్రకాశిస్తుంది అని మహేష్ ట్వీట్ చేసాడు.

ఇదిలా ఉండగా ప్రస్తుతం మహేష్ బాబు “సర్కారు వారి పాట” అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. త్వరలోనే ఈ సినిమాకి సంబందించిన షూటింగ్ అమెరికాలో మొదలు కానుంది. వచ్చే ఏడాది రిలీజ్ చేసే యోచనలో సినిమా యూనిట్ ఉంది. ఈ సినిమాలో మహేష్ తన మేక్ఓవర్ పూర్తిగా మార్చుకోవడంతో రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ పోస్టర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. గీత గోవిందం డైరెక్టర్ పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో మహేష్ సరసన కీర్తి సురేష్ హీరోయిన్ గా చేస్తున్నట్లు టాక్.