వాస్తవం ప్రతినిధి: అమెరికా అధ్యక్ష ఎన్నికలు ముగిశాయి. కొత్త అధ్యక్షుడిగా జోబైడెన్, ఉపాధ్యక్షురాలుగా కమలాదేవి హారిస్‌లు ఎన్నికయ్యారు. వచ్చే ఏడాది జనవరిలో పదవిని అధిష్టించేందుకు ఇప్పటినుంచే ఏర్పాట్లు జరుగుతున్నాయి. మరోవైపు, వైట్‌హౌజ్‌ను వీడిన మరు క్షణమే డొనాల్డ్ ట్రంప్‌కు విడాకులు ఇవ్వాలని మెలానియా ట్రంప్ డిసైడ్ అయినట్లు ప్రచారం జరుగుతున్నది. ట్రంప్‌తో తన 15 ఏండ్ల పెండ్లిబంధానికి ముగింపు పలికేందుకు మెలానియా ఎదురుచూస్తున్నట్లుగా ట్రంప్ మాజీ రాజకీయ సహాయకురాలు ఒమరోసా న్యూమ్యాన్ చెప్పారు.
అయితే, బుధవారం వెటరన్స్ డే సందర్భంగా ఆయన సతీమణి మెలానియా ట్రంప్‌తో కలిసి ఆర్లింగ్టన్ జాతీయ స్మశానవాటికను సందర్శించారు. అమెరికా ఆర్మీలో సేవలందించిన వారిని స్మరించుకునేందుకు ప్రతి ఏడాది నవంబర్ 11వ తేదీన వెటరన్స్ డేను జరుపుతారు. అయితే, ఈ కార్యక్రమంలో ట్రంప్ ఫేస్‌మాస్కు ధరించనప్పటికీ సామాజిక దూరం పాటించారు. కానీ, అమెరికన్ ప్రథమ మహిళ మెలానియా మాత్రం ఇవేమీ పట్టించుకోకుండా ఓ సైనికుడి చేయి పట్టుకుని అతనికి దగ్గరగా నడిచారు. కార్యక్రమం ముగిసే వరకు ఆమె సోల్జర్‌కు దగ్గరగా.. ట్రంప్‌కు దూరంగానే నడిచారు. దీంతో తన వింత ప్రవర్తనతో ఈ కార్యక్రమానికి వచ్చిన వారిని మెలానియా ఒకింత షాక్‌కు గురిచేసింది.