రాహుల్ గాంధీ పై బరాక్ ఒబామా ఆసక్తికర వ్యాఖ్యలు..!!

వాస్తవం ప్రతినిధి: కాంగ్రెస్ మాజీ చీఫ్ రాహుల్ గాంధీ గురించి యూఎస్ మాజీ ప్రెసిడెంట్ బరాక్ ఒబామా తన కొత్త పుస్తకంలో ప్రస్తావించారు. ఒబామా..తన రాజకీయ అనుభవాలు, జీవిత జ్ఞాపకాలను ‘ఎ ప్రామిస్డ్ ల్యాండ్’ పేరుతో ఓ పుస్తకాన్ని రాశారు. నవంబరు 17న ఈ పుస్తకాన్ని విడుదల చేయనున్నారు. ‘రాహుల్ గాంధీ కొంచెం నిరుత్సాహంగా కనిపిస్తారు. తన నైపుణ్యంపై ఆయన కొంత నెర్వస్‌గా ఉంటారు. పని పూర్తి చేసి టీచర్ మెప్పు పొందాలని ఒక విద్యార్థి ఎలా ఆరాటపడతారో రాహుల్ అలా కనిపిస్తారు. అయితే ప్రావీణ్యం సంపాదించాలనే తపన మాత్రం రాహుల్‌‌లో లేదు. ఆయనలో స్పష్టత, ధైర్యం కొరవడ్డాయి’ అని ది ప్రామిస్డ్ ల్యాండ్ అనే సదరు పుస్తకంలో ఒబామా రాసుకొచ్చారు. అలాగే సోనియా గాంధీపై కూడా ఈ పుస్తకంలో ఒబామా మాట్లాడారు. న్యూయార్క్ టైమ్స్ సమీక్షించిన ఈ పుస్తకంలో… ప్రపంచంలోని ప్రముఖ రాజకీయ నేతల గురించి ఒబామా తన అభిప్రాయాలను వెల్లడించినట్టు సమాచారం.